ప్రతి విద్యార్థికి కార్పొరేట్‌స్థాయి విద్యే లక్ష్యం
వేములవాడ, మే 11,(విజయక్రాంతి)ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వేములవాడ పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు,వేసవి శిబిరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేదలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తున్నామన్నారు.ఆధునిక డిజిటల్ క్లాస్రూమ్స్, స్మార్ట్ ల్యాబ్స్, మెరుగైన మౌళిక వసతులతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.






