భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బ్యాండ్ మేళం చిత్రం యూనిట్
వరంగల్, మార్చి 18 (విజయక్రాంతి):.వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారిని బ్యాండ్ మేళం చిత్రం యూనిట్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హీరో, హీరోయిన్ రోషన్, శ్రీదేవి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీష్ కు ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మయూరి రామేశ్వర్రావులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చిత్రం యూనిట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ నెల 26వ తేదీన రిలీజ్ కాబోతున్న వారి బ్యాండ్ మేళం చిత్రం పెద్ద హిట్ కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.




