5 May, 2026 | 8:17 AM

ఇదేనా రైతు ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం..

05-05-2026 01:10 AM

రైతులతో కలిసి రైతు సంఘం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎర్రుపాలెం, మే 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయం పైన రైతులు పండించిన పంటల పైన ఒక ప్రణాళిక లేదని రైతుల  ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయలేని ప్రభుత్వంకు రైతు బాధలు కనిపించడం లేదా అని రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు ప్రశ్నించారు.

ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామం వద్ద రైతులతో కలిసి ప్రధాన రోడ్డు మార్గం పైన బైఠాయించి మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయాలని  నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చివరి మండలం ఆంధ్ర సరిహద్దు ప్రాంతం పెద్ద మండలం భూమి విస్తీర్ణత కలిగి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ పంట ఎక్కువ దిగుబడి కలిగిన ఎరుపాలెం మండలంలో ఒక్కటంటే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రైతు పంటలు కొనుగోలు చేయటం మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

రైతుల పోరాటాలతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రైతులను బాధపెట్టిన కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడలో లేదని వారి కన్నీటి వరదలో కొట్టుకుపోతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కన్నెబోయిన శ్రీనివాసరావు,నల్లమోతు హనుమంతరావు,షేక్ లాల్, మందడపు ప్రభాకర్ గొల్లపూడి హరినారాయణ, శీలం వెంకటేశ్వరరావు, అనుమొలు విశ్వనాధం, షేక్ జాని, తల్లపు రెడ్డి వెంకట రెడ్డి రైతులు పాల్గొన్నారు.