18 March, 2026 | 11:39 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత

18-03-2026 12:49 AM

కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, మార్చి 17 (విజయ క్రాంతి): మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అ న్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవాలని అన్నారు. కాన్షియస్ నెస్ క్లబ్బులు చురుగ్గా పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు.

జిల్లాలోని పలు సంక్షేమ శాఖ అధికారులను కూడా డ్రగ్స్ నివారణ కార్యక్రమాల్లో, సమావేశాలలో భాగస్వాములను చేయాలన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళికలను డ్రగ్స్ నిర్మూలన ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. అందుకు తగిన రీతిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలోని యాంటీ డ్రగ్ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు.

వివిధ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని అన్నారు.    జిల్లాలో గత రెండు నెలల్లో డ్రగ్ సంబంధిత కేసులు 3 నమోదు కాగా ఆరుగురిని అరెస్టు చేశామని, 578 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.