28 March, 2026 | 3:18 AM

ప్రపంచమంతా ఏఈ ఆలోచన

28-03-2026 01:21 AM
  1. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హార్వర్ట్ కెన్నడీ స్కూల్ నిర్వహించిన సదస్సులో వర్చువల్‌గా మాట్లాడిన సీఎం

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాం తి): అమెరికా బోస్టన్ సిటీలోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై శుక్రవారం రాత్రి నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా మాట్లాడారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఈ తొలి ఏఐ సింపోజియంలో ముఖ్యఅతిథిగా మాట్లాడటం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ‘ఈ రోజు ప్రపంచమంతా ఏఐ గురించి ఆలోచిస్తోంది. ఏఐ మానవజాతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి. కానీ ఇది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చూపుతుంది’ అని సీఎం అన్నారు.

ఇప్పుడు ఏఐతో, ఆలోచనా సామర్థ్యానికి సవాల్ ఎదురవుతోంది. ఇది అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందన్నారు. తెలంగా ణ రైజింగ్. ఏఐ విషయంలో నా వంటి నాయకులకు తలెత్తే ప్రశ్న ఏమిటంటే మేం ఏం చేయాలి? హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సెంట ర్. ఫార్మా, సాఫ్ట్‌వేర్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సైస్, మ్యానుఫాక్చరింగ్, ఏరో స్పేస్, ఢిపెన్స్, రిటైల్ రంగాలకు గ్లోబల్ సంస్థల కేంద్రం. వైట్ కాలర్ జాబ్ల సక్సెస్పునే హైదరాబాద్ ఆధారపడి ఉంది. ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తే, మేం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ అనే కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాను’ అని సీఎం తెలిపారు.