5 April, 2026 | 1:33 PM

బీఆర్‌ఎస్ పాలనంతా అవినీతే

05-04-2026 01:37 AM
  1. గాంధీ కుటుంబానికి మోదీకి పోలిక ఏమిటి?
  2. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  3. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులతో ప్రమాణం

ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనంత అవినీతి మయంగా సాగిందని, కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం, బావా బామ్మర్దుల మధ్య పదవుల పోట్లాట, కూతురితో ఆస్తి తగాదా.. ఇలా కేసీఆర్ కుటుంబ పరిస్థితి నెలకొందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. శనివారం ఆదిలా బాద్, నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షులతో ఆయన ప్రమాణం చేయించారు. 

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ నెల 6న బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించే సభలో రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని.. దీనికి తానే ఉదాహరణ అని చెప్పారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుం బ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం దేవుళ్ల వేరుతో రాజకీయం చేస్తోందే తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దే వా చేశారు. దేశం కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి.. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు వెడుతు న్న మోదీ, అమీతాలతో పోలికే లేదన్నారు.

ఎస్.ఐ.ఆర్ సర్వే పేరుతో ముస్లీంల ఓట్లను తొలగించేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కానున్నాయని అన్నారు. మోదీ ప్రభు త్వం రాముని పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తూ దేశ విభజనకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దేశంలో అదాని, అంబాని సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఇప్పటికి దేశంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే దేశాన్ని పాలించిన నెహ్రు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణ లేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల్లో బిజెపి మాయమాటలు నమ్మి ప్రజలు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాలని ఇప్పుడు ప్రజలే బాధపడుతున్నారని తెలిపారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఇవే చివరి పదవులని ఎద్దేవా చేశారు.

కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎంపి సోయం బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, నాయకులు కంది శ్రీనివాన్ రెడ్డి, ఆడె గజేందర్, గండ్రత్ సుజాత, మంచికట్ల ఆశమ్మ, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో విభేదాలు

కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విభేదాలు లేవని పీసీసీ అధ్యక్షుడు పదే పదే ప్రకటిస్తున్న నిర్మల్ సమావేశంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులకు పదవులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నాయకు లకు పదవులు ఎట్లా ఇస్తారని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ విమర్శించారు. దీనికి స్పందించిన తాజా మాజీ ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి.. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

దీనిపై పీసీసీ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షులు జోక్యం చేసుకొని పార్టీలో సర్దుకుపోవాలని తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అంజి, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, రేఖ శ్యాం నాయక్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.