మల్లాపూర్ మండలంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
05-04-2026 01:25 PM
మల్లాపూర్,(విజయాక్రాంతి): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను మల్లాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మల్లాపూర్, మొగిలిపేట, రాఘవపేట, చిట్టాపూర్ గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం చేసిన ఆయన చేసిన కృషిని గ్రామ ప్రజలు స్మరించుకున్నారు. గ్రామ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొని ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.




