పెద్ద ధన్వాడకు తిరగని ఆర్టీసీ బస్సు
- ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
- ఐదు కిలో మీటర్ల దూరం స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు
అలంపూర్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న మాటలు.. ప్రభుత్వాలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీటి మీద రాతలుగా మారాయి. సాంకేతికంగా ఎం తో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూ డా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ఆర్టీసీ బస్సులు ఎరుగని పల్లెలు ఎన్నో? గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి గత పదేళ్లుగా ఆర్టీసీ బస్సును నోచుకోక గ్రామస్తులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
శనివారం గ్రామానికి చెందిన విద్యార్థులు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో చిన్న తాండ్రపాడులో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలకు నిత్యం ఇలా కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు గ్రామానికి రోడ్లు వేయిస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకుని చివరకు గెలిచిన తర్వాత మొఖం చాటేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.




