బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జారె
05-04-2026 01:03 PM
దమ్మపేట,(విజయక్రాంతి): ఆదివారం గండుగులపల్లిలోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ జారే మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అందరికీ ఆదర్శమని కుల వ్యవస్థపై పోరాటం చేసి, అణగారిన వర్గాలకు న్యాయం కల్పించేందుకు కృషి చేశారని కొనియాడారు.




