5 April, 2026 | 7:28 PM

కాచాపూర్‌లో కాంగ్రెస్ దళిత మోర్చా నాయకుడి మృతి

05-04-2026 12:01 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దళిత మోర్చా నాయకుడు బండారి శ్రీనివాస్ గుండెపోటుతో నిన్న సాయంత్రం 5:30 గంటలకు మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసి, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ కమిటీ చైర్మన్ & గ్రామ ఉప సర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కిష్టాగౌడ్, మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి, గ్రామ పంచాయతీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.