5 April, 2026 | 7:33 PM

సమాజానికి మార్గదర్శకుడు జగ్జీవన్ రామ్

05-04-2026 11:55 AM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారు సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.