23 April, 2026 | 3:14 AM

అమనగల్లు మున్సిపల్ కో-ఆప్షన్ పోరు

23-04-2026 12:47 AM

విప్ వర్సెస్ ఫిరాయింపులు.. గెలుపెవరిది?

కో ఆప్షన్ ఎంపికలో తెర వెనుక తాయిలాల ఎరా 

అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు 

అమనగల్లు, ఏప్రిల్ 22(విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో అమనగల్లు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేడు కోఆప్షన్ ఎన్నిక కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమనగల్ మున్సిపల్ లో మళ్ళీ ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఒక ఎత్తుతై, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మరో ఎత్తుగా మారింది.

బలబలాలు ఒక పార్టీకి ఉంటే, అధికారం మరో కూటమి చేతిలో ఉండటంతో ఈ ’రాజకీయ చదరంగం’ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.అమనగల్లు మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా, పార్టీల వారీగా బలాబలాలు ఇలా ఉన్నాయి.పార్టీ కౌన్సిలర్ల సంఖ్య ప్రస్తుత పరిస్థితి బీఆర్‌ఎస్ 07 సాంకేతికంగా మెజారిటీ పార్టీ (విప్ జారీ చేసే అధికారం ఉంది)బీజేపీ 06 కాంగ్రెస్తో జతకట్టి అధికారంలో ఉంది.కాంగ్రెస్ 01 బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి(బీఆర్‌ఎస్ నుండి వలస వచ్చిన నేత)

‘గుర్తు’ ఒకరిది.. ’మద్దతు’ ఇంకొకరిది!

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, రాజకీయ సమీకరణాల వల్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి చెందిన 6 మంది కౌన్సిలర్ల మద్దతుతోఆయన పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే, ఇప్పుడు 4 కో-ఆప్షన్ పదవుల కోసం ఎన్నిక జరగాల్సి ఉండటంతో పాత లెక్కలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

విప్ అస్త్రం.. అనర్హత వేటు భయం!

బీఆర్‌ఎస్ పార్టీ తనకున్న 7 మంది కౌన్సిలర్లకు (చైర్మన్తో కలిపి) ’విప్’ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. చట్టప్రకారం, బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన వారు ఆ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే వారి కౌన్సిలర్ పదవికే ముప్పు వాటిల్లుతుంది. పార్టీ విప్ను పాటిస్తే, తన కూటమి (బీజేపీ -కాంగ్రెస్) అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది.

ఒకవేళ ధిక్కరిస్తే, అనర్హత వేటు పడి చైర్మన్ పదవినే కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక వేల విప్ జారీ చేయకపోతే కౌన్సిల్లో తమ ఇష్టానుసారం మద్దతు తెలిపి కో ఆప్షన్ ఎంపికకు చేతులెత్తి మద్దతు దార ఎన్నుకోనే అవకాశం ఉంది. ఈ మద్దతులో తెర వెనుక తాయిలాల ఎర కూడా నడుస్తుంది. కౌశల్ కు మద్దతు తెలిపే కౌన్సిలర్లకు  భారీగానే డబ్బులు చెప్పే అవకాశాలు కూడా సైతం ఉన్నాయంటూ వార్తలు చెక్కలు కొడుతున్నాయి.

బరిలో 13 మంది.. విజయం ఎవరికి?

మున్సిపల్ లో మొత్తం 4 కో-ఆప్షన్ స్థానాల కోసం 13మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి లో  జంతుక అల్లాజి,కమటం రాధమ్మ,సీతారాములమ్మ, చుక్క అల్లాజీ గౌడ్,  అబ్దుల్ అలీ,సయ్యద్ ఖలీల్,మహమ్మద్ అబ్దుల్ రహిం,మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ అబ్దుల్ అజీమ్,మహమ్మద్ అబ్దుల్ హపీజ్,ఎమ్ ఇమ్రాన్ టిగ్, అస్మత్ బేగం,అలీమ భోగం లు దరఖాస్తు చేసుకున్నారు.

ఎవరి పక్షం మొగ్గు?..

విప్ గనుక పక్కాగా అమలు అయితే, సాంకేతికంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులకే 4 పదవులూ దక్కే అవకాశం మెండుగా ఉంది.అధికార బలంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవాలని కూటమి నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు.అమనగల్లులో ‘బలం‘ బీఆర్‌ఎస్ దగ్గర ఉన్నా.. బలగం‘ (అధికారం) కూటమి చేతిలో ఉంది. చైర్మన్ వర్గం విప్కు తలొగ్గి సొంత పార్టీని గెలిపిస్తుందా? లేక సాహసోపేత నిర్ణయం తీసుకుని పదవిని పణంగా పెడుతుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

ఈ రాజకీయ పోరు కేవలం 4 కో-ఆప్షన్ పదవుల కోసమే కాదు, పార్టీల ఉనికికి మరియు ఫిరాయింపు నేతల భవిష్యత్తుకు ఒక ’అగ్నిపరీక్ష’ వంటిది. అయితే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కోఆప్షన్ ఎన్నిక విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.