19-02-2026 01:33:26 AM
12 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్‌గా 16 మంది ఎన్నిక
ములుగు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రంలో పూర్తి పెత్తనం
మహబూబాబాద్, జనగామ, నర్సంపేట చైర్ పర్సన్లు
వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘనాపూర్, తొర్రూరు వైస్ చైర్పర్సన్లు
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కౌన్సిలర్లు, వైస్ చైర్పర్సన్, చైర్ పర్సన్లు గా అతివలు ఎన్నికయ్యారు. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 12 చైర్పర్సన్లకు గాను మహబూబాబాద్, ములుగు, జనగామ, నర్సంపేట, కేసముద్రం, మరిపెడ, డోర్నకల్ ఏడు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ పదవుల ను అతివలు కైవసం చేసుకున్నారు.
అలాగే వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్, తొ ర్రూర్ మున్సిపాలిటీల వైస్ చైర్మన్ పదవులను మహిళలు హస్తగతం చేసుకున్నారు. ఇందులో ములుగు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను దక్కించుకొని పూర్తిగా అతివలే ఆ మున్సిపాలిటీల్లో పురపాలన సా గించనున్నారు. 12 మున్సిపాలిటీల్లో భూపాలపల్లి మున్సిపాలిటీలో మాత్రమే చైర్ ప ర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు పూర్తిగా పురుషులకు దక్కాయి.
ములుగు మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పదవి చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ పదవి ఆషియా షాహిన్, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి కొండేటి రాజకుమారి, వైస్ చైర్పర్సన్ పదవి మాద లావణ్య, కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి బానోత్ సునీత, వైస్ చైర్పర్సన్ పదవి డాక్టర్ అల్లం రమ, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి విశారపు ప్రగతి, వైస్ చైర్పర్సన్ పదవి కాలపు సునీత దక్కించుకున్నారు.
ఇక జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి కడకంచి బాలమణి, మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి గూగులోత్ జ్యోతి, నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి పెండెం శ్రీలక్ష్మి గెలుచుకున్నారు. ఇక తొర్రూరు మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పదవి సోమ రజని, వర్ధన్నపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పదవి నేతావత్ షిభారాణి, పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ పదవి ఏకు దివ్య, స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పదవి నీల రాజమ్మ దక్కించుకున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 12 చైర్పర్సన్, 12 వైస్ చైర్పర్సన్ పద వులు కలుపుకొని 24 ఉండగా, అందులో 15 పదవుల్లో మహిళలు, అలాగే 260 వా ర్డు కౌన్సిలర్లకు గాను 50 శాతం మహిళలు కౌన్సిలర్లుగా ఎన్నికై ఈసారి పురపాలనలో అతివలు పై చేయి సాధించారు.