19-02-2026 01:35:14 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): హాస్టల్ జీవితం అద్వానంగా మారింది.. వార్డెన్ ను భోజనం సరిగా లేదని అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని.. ఇక హాస్టల్లో ఉండే పరిస్థితి లేదంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి విద్యార్థులు నిరసనకు దిగిన ఘటన బుధవారం జరిగింది.
నాన్యమైన భోజనం పెట్టాలని అంటే ప్రిన్సిపాల్ కులం పేరుతో దుశిస్తున్నాడని ఆరోపిస్తూ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనకు డిఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నేతలు ధర్నా కు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను ఆర్ సి ఓ రత్నా కుమారి దూషిస్తూ, సమస్య పరిష్కారం చేయకుండా తమ మీదకి రాకుండా బయటపడటానికి డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూత వేటు దూరంలో గిరిజన గురుకులంలో సమస్యలు పేరుకు పోతే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు.తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వాటితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి విరమింప చేశారు.