13 July, 2026 | 9:54 AM

వైభవంగా సురమాంబికా సమేత కంఠమహేశ్వరుని కళ్యాణం

13-07-2026 09:01 AM

వనదేవతలారా... దీవించండి..

భక్తి పరవశంతో కలకలలాడిన కీతవారిగూడెం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలో ని కీతవారిగూడెం గ్రామంలో గౌడుల ఆరాధ్య దైవమై కొలువై ఉన్న సురమాంబికా సమేత కంట మహేశ్వర స్వామి దేవాలయ దశమి వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు కార్యక్రమాన్ని గౌడులు ప్రత్యేక పూజలతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు బ్రహ్మశ్రీ రాయప్రోలు భద్రయ్య శర్మ, బ్రహ్మశ్రీ శ్రీరామయ్య శర్మ, ఆధ్వర్యంలో మొదటిరోజు శుక్రవారం గ్రామంలోని అన్ని దేవాలయాలకు మామిడి తోరణాలు అలంకరించుకొని మహిళా భక్తులు జల బిందెలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

శనివారం రాత్రి శ్రీ సూరమాంబికా సమేత కంఠమహేశ్వర స్వామి కళ్యాణం, తలంబ్రాలు, నిరాజనం మంత్రపుష్పం, మంగళహారతులు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వనం మైసమ్మ, ఎల్లమ్మ దేవతలకు బలిహరణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ గూడేపూరి గోపయ్య గౌడ్, వైస్ చైర్మన్ గుండు రాంబాబు గౌడ్, మాట్లాడుతూ గ్రామం పాడి పంటలు, పశువులు, రైతులు సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం సురమాంబికా సమేత కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణం వనదేవతలకు బలిహరణ పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్, ఉత్సవ విగ్రహాల దాత తుమ్మల సైదయ్య గౌడ్, అమ్మవారి పుస్తెలు మెట్టెల దాత గుండు సైదులు గౌడ్, గౌడ సంఘం గరిడేపల్లి మండల అధ్యక్షులు పోలంపల్లి ఆనంద్ బాబు గౌడ్, కుల పెద్దలు పాలకవర్గం సభ్యులు మహిళలు పాల్గొన్నారు