ఏఆర్ కానిస్టేబుల్ సైదులు మృతి అత్యంత బాధాకరం
21-04-2026 12:43 AM
-కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
హుజూర్ నగర్, ఏప్రిల్ 20: రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ సైదులు మృతి అత్యంత బాధాకరమని రాష్ట్ర శాసనసభ ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు.ఇటీవల సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ...పోలీస్ శాఖలో నిబద్ధతతో విధులు నిర్వర్తించారని,ఏఆర్ కానిస్టేబుల్ సైదులు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, బెల్లంకొండ శ్రీనివాస్, అజీజ్ పాష,తదితరులు పాల్గొన్నారు.






