ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
01-07-2026 04:06 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా వెంకటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి ప్రతి రోజు వస్తున్న బయట పేషెంట్ వివరాలు, అందుతున్న సేవలు రక్త పరీక్షల వివరాల గూర్చి స్థానిక వైద్యధికారులు ఆయనకు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లోపల, బయట గల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని అదేషించారు. అయన వెంట స్థానిక వైద్యాధికారి డా రోహిత్ కుమార్ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.






