1 July, 2026 | 5:08 PM

ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు పక్కాగా నింపాలి

01-07-2026 04:18 PM

ఓటర్లకు బీఎల్ఓ లు సహాయం అందించాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల పట్టణంలోని 33 వార్డులో  జిల్లా కలెక్టర్ పరిశీలన

సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ (Special Intensive Revision) ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు పక్కాగా నింపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణంలోని 33 వార్డులో బూత్ నంబర్ 163,164, 166 కేంద్రాల పరిధిలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించి, పలు సూచనలు చేశారు.

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)లు ఓటర్లకు ఇప్పటికే పంపిణీ చేసిన ఫారాలతోపాటు ప్రస్తుత పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకోవాలని సూచించారు. ఫారంలో అన్ని వివరాలు పక్కాగా నింపాలని ఆదేశించారు. అన్ని వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. పరిశీలనలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది ఉన్నారు.