మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాలతో రహదారి నిర్మాణ పనులు పూర్తి
21-04-2026 12:44 AM
గరిడేపల్లి, ఏప్రిల్ 20: మండల పరిధిలోని వెలిదండ గ్రామ పరిధిలో కీతవారిగూడెం నుండి మునగాల వరకు నూతనంగా నిర్మించిన రహదారిలో వెలిదండ గ్రామము వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో కొంత భాగం రహదారి కొంత భాగం పూర్తి కాలేదు. సంబంధిత అంశాన్ని గ్రామ సర్పంచ్ చెన్నగాని సాంబయ్య మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ విషయంపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు 15 రోజుల్లో పనులు పూర్తి కావడం పట్ల గ్రామ సర్పంచ్ చనగాని సాంబయ్య మంత్రి ఉత్తమ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.






