26 July, 2026 | 2:27 AM

కరేడు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

26-07-2026 12:43 AM
  1. అప్పటి వరకు పోరాటం ఆగదు
  2. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు 

ఒంగోలు, జూలై 25: కరేడు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, యానాదులు, ఎరుకలు, యాదవులు, మాలలు, మాదిగలు, ముస్లిం లు, క్రైస్తవులు, బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆరోగ్య కారణాల వల్ల సభకు ప్రత్య క్షంగా హాజరుకాలేకపోయిన ఆయన జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏ పీలోని ఒంగోలు జిల్లా కరేడు భూ నిర్వాసితుల సమస్యలపై జరిగిన బహుజన మాట బహుజన పాట సభకు రాష్ట్రవ్యాప్తంగా బ హుజన, ఆదివాసీ, బీసీ, మైనారిటీ సంఘా ల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడు తూ, రాష్ట్రంలో రెండు ఆధిపత్య కులాల రాజకీయాల వల్లే యానాదులు, ఎరుకలు, చెంచులు, కుమ్మర్లు సహా వందలాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు.

రాజకీయ అధికారం లేకపోవడం వల్లే కరేడు, పోలవరం, పంచదార్ల, యడవల్లి వంటి భూసమ స్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. కరేడు ప్రాంతంలో వేల ఎకరాల భూముల ను ఇండోసోల్ సంస్థకు కేటాయించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు నిర్వాసితులవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సమన్వయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది అజీజ్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, శ్రీరాములు, ఎన్.ఏ.డి. పాల్, మన దే అధికారం ఛానల్ అధినేత కిషోర్, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డేని యల్, సీనియర్ మహిళా నాయకురాలు దివి ఉమా లక్ష్మి, పొట్లూరి దేవి బీసీ చైతన్య వేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కరేడు నిర్వాసిత రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.