పార్టీ కంటే దేశమే ప్రధానం
కేంద్రమంత్రి బండి సంజయ్
తమకు పార్టీ కంటే దేశమే ప్రధానమని, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్, సెల్ఫ్ లాస్ట్ అని కేం ద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి ప్రభుత్వంలో కీలక బాధ్యతల వరకు తన జీవితంలో దశాబ్దాల పాటు ధర్మేంద్ర ప్రధాన్ సేవలందించారని పేర్కొన్నారు.
ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిచారు. ప్రధాని మోదీ నాయక త్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాట వినడం, వారి గొంతును గౌరవించడం, అవసరమైతే బాధ్యత తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉండటమని, దాన్నే బీజేపీ పాటిస్తుందన్నారు. పదవులు తాత్కాలికమని, ప్రజల విశ్వాసమే అత్యంత ప్రధానమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పార్టీ విలువలను ప్రతిబింబిస్తుందని, ఇన్నేళ్లపాటు దేశసేవలో భాగమైనందున ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.






