13 March, 2026 | 10:41 AM

13 రోజుల్లో 17 బిలియన్ల డాలర్ల ఖర్చు?

13-03-2026 12:12 AM

తొలి ఆరు రోజుల్లో 11.3 బిలియన్ల డాలర్లు

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఖర్చు 

చట్టసభలకు తెలిపిన పెంటగాన్

వాషింగ్టన్, మార్చి 12: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం 13 రోజుల్లో 17 బిలియన్ల డా లర్లను అమెరికా ఖర్చు చేసినట్లు అంచనా. అయితే తొలి ఆరు రోజుల్లోనే 11.3 బిలియన్ల డాలర్ల విలువై ఆయుధాలను విని యోగించినట్లు పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఖర్చును చట్టసభలకు పెంటగాన్ తెలిపింది. అయితే తొలి 100 గంటల్లోనే సుమారు 3.7 బిలియన్ల డాలర్లు ఖర్చయినట్లు తెలిసింది. ఇరా న్‌పై అమెరికా దళాలు ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభించిన విష యం తెలిసిందే.

అయితే ఆ యుద్ధం మొదలైన మొదటి ౬ రోజుల్లో అమెరికా సు మారు 11.3 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ ఈ విషయాన్ని ఆదేశ చ ట్టసభ ప్రతినిధులకు తెలియజేసినట్లు ఓ మీ డియా కథనం పేర్కొన్నది. అనూహ్య రీతిలో ఇరాన్ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా భారీగా తన ఆయుధ సంపత్తిని వినియోగిస్తోంది. ఆయుధాలను విరివిగా వాడుతోంది. దీంతో ఖర్చు తారీస్థాయికి చేరుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు.

అయితే ఇంకా చాలా విషయాల్లో ఖర్చును మినహాయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఖ ర్చును కూడా జోడిస్తే, అప్పుడు యుద్ధం ఖ ర్చు తొలి వారంలోనే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా రక్షణశాఖ అధికారులు ఇదే విషయాన్ని ఆ దేశ చట్టసభ ప్రతినిధులకు కూడా చెప్పారు. కేవలం తొలి రెండు రోజుల్లోనే సుమారు 5.6 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. ఇది అంచనా కన్నా అధికంగా ఉన్నట్లు తేల్చారు.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం తొలి 100 గంటల్లోనే సుమారు 3.7 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తన రిపోర్టులో పేర్కొన్నది. రోజుకు దాదాపు 891 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తేల్చా రు. ఇరాన్ యుద్ధ ఖర్చులను ట్రాక్ చేస్తున్న ఓ వెబ్‌సైట్ ప్రకారం... గురువారం వరకు అమెరికా ఈ యుద్ధం కోసం 17 బిలియన్ల డాలర్లు ఖర్చుచేసినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో రోజు యుద్ధం కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి ఈ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుందని, ఒకవేళ దాన్ని కూడా జోడిస్తే అప్పుడు ఖర్చు తడిసి మోపెడవుతుందని భావిస్తున్నారు.