ప్రభుత్వ పథకం ప్రతి పేదోడికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రతి పేదోడికి అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సన్న బియ్యం పేదలకు అందించడం సంవత్సరం పూర్తి కావడంతో సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై సహపంక్తి భోజనాన్ని ప్రజలతో కలిసి చేశారు.
అనంతరం సీఎంఆర్‌ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 2 కోట్ల 55 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అర్హులకు అందించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రతి పేదోడికి సన్న బియ్యం పథకం ద్వారా నాణ్యమైన ఆహారం అందుతుందని దేశంలో సన్నబియ్యం ఇస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. జిల్లా మంత్రుల సహకారంతో రాబోయే రోజుల్లో మిర్యాలగూడను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష పట్టణ నాయకులు మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




