ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా
తుంగతుర్తి, ఏప్రిల్ 6 : తుంగతుర్తి రైతాంగం పంటలు కాపాడే విధంగా ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన తెలియచేస్తూ రాస్తారోకో చేశారు.. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని. రైతుభిమా అమలు చేయాలని డిమాండ్ చేసారు.. మండలంలో కాలువ నీళ్ళను బందు చేయడం వలన దాదాపు ఇరవై శాతం పంటలు నిండు పొట్ట దశలో ఎండిపోయి ప్రమాదం ఉందని. రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని అన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు తెలియ పరచినప్పటికీ కలెక్టర్ సైతం ఇప్పటివరకు స్పందించ లేదని అన్నారు... స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పెద్ద మనసుతో నీటిని విడుదల చేయుటకు కృషి చేయాలని, డిమాండ్ చేస్తున్నాం వెంటనే జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి నీరు విడుదల చేయాలని కోరారు. రైతాంగం సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన శాస్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ మండల నాయకులు గుండగాని దుర్గయ్య గాజుల యాదగిరి సర్పంచ్ లు మనోజ్ ఎల్లయ్య. కర్ణాకర్. మాజీ ఎంపిటిసి నరేష్ నాయక్. మాజీ సర్పంచ్ విరోజీ నాయక్. తడకమళ్ళ రవి కుమార్.నాగమల్లు మహేందర్. భాస్కర్. సైదులు క్రాంతి. జాని.. ధర్మానాయక. తునికిలక్ష్మి. బిక్షం.. సూరయ్య. వీరన్న. సాయికిరణ్ పాల్గొన్నారు.




