12 May, 2026 | 3:38 AM

ఇండ్ల గణనను పరిశీలించిన కలెక్టర్

12-05-2026 12:00 AM

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి): జిల్లాలోని జైపూర్ మండలం రామారావుపేటలో కొనసాగుతున్న ఇండ్ల గణన ప్రక్రి యను సోమవారం జైపూర్ ఆర్డీవో వనజా రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇండ్ల జాబితా బ్లాక్ ల ప్రకారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

జనగణన గృహ జాబితా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జనగణన ఆధారంగా రూపొం దించడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని చెరువు మత్తడి పరిశీలించారు. 

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్...

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని టేకుమట్ల, రామారావుపేటలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే జిల్లాలో గుర్తించిన గోదాములకు తరలించి నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 12 రైస్ మిల్లుల ద్వారా ధాన్యం ప్రక్రియ చేపడుతున్నామన్నారు. అనంతరం నస్పూర్ మండలం తీగల్ పహాడ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిక్షణ శిబిరాలలో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడ రంగాల్లో రాణించాలని కోరారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు.