20 March, 2026 | 2:53 AM

తొక్కుకుంటూ వస్తా అన్న సీఎం వార్నింగ్.. కాంగ్రెస్ సీనియర్లకే!

20-03-2026 12:48 AM

ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి సమావేశాలు

  1. వందేమాతరం గేయం ఆలాపన బహిష్కరణ దుర్మార్గం 
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మార్చి 19 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నరు. వాళ్లందరినీ తొక్కుకుం టూ వెళ్లి రేవంత్‌రెడ్డి సీఎం పదవి తెచ్చుకున్నడు. ఈ మధ్య కొంతమంది సీనియ ర్లు ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి మీటింగులు పెడుతున్నరు. వాళ్లను ఉద్దేశించే సీఎం అసెంబ్లీలో ఆ వార్నింగ్ ఇచ్చి నట్లు ఉంది’ అని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ అన్నారు.

పరాభవ నామ సంవత్సరం సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం చైతన్యపురిలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప, తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో రేవంత్‌కే తెలియాలన్నారు. తొక్కుకుంటూ వస్తున్న రేవంత్‌రెడ్డిపైనే రాహుల్‌గాంధీ సైతం ఆధారపడి ఐదు రా ష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని వ్యాఖ్యానించారు.

ఆ ఎన్నికల్లో సర్వేల నుంచి, నగదు సమకూర్చే వరకు అన్ని బా ధ్యతలు రేవంత్‌రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపై మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని అని అన్నారు. బీఆర్‌ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉన్నదని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని విమర్శించారు.

అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్‌ఎస్ నేతలు నిలదీయడంలేదని, బీఆర్‌ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తూ 2019 నుంచి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో ఏటా మూడుసార్లు రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తోందన్నారు మొన్న 22వ విడతగా మొత్తం 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేశారన్నారు.

కానీ కాంగ్రెస్ ప్ర భుత్వం తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని ఎందుకు సంపూర్ణంగా అమలు చేయ డం లేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చే జూన్ నాటికి మొత్తం 6 వాయిదాలు వేయాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు 3 వాయిదాలు మాత్ర మే చెల్లించారన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులు, దాదాపు 50 లక్షల మంది వ్యవసా య కూలీలు ఉన్నారన్నారు.

రైతులు, కౌలు రైతులకు కలిపి ఏటా రూ.13,500 కోట్లు జమ చేయాలన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.6 వేల కోట్లు ఈ రెండు కలిపి 19,500 కోట్లు జమచేయాలన్నారు. జూన్ తో కలిపితే 6 వాయిదాలు(3 ఏళ్లు) కలిపి 58 వేల 500 కోట్ల సొమ్మను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 17 వేల కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు.

బీసీని ప్రధాని చేయడంతోపాటు 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులిచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. అట్లాగే 12 మంది ఎస్సీలను, 7గురు ఎస్టీలను కేంద్ర మంత్రులుగా నియమించిన ఘనత బీజేపీదన్నారు. అంతేకాదు ఎస్టీ ఆదివాసీ మహిళకు, మైనారిటీ రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన పార్టీ బీజేపీ అని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

వందేమాతరం గేయ ఆలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, మం త్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడం దుర్మార్గమని బండి సంజ య్ అన్నారు. భారత జాతీయ గేయాన్ని, భారతమాతను   అవమానించారన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసిందన్నారు.