19 April, 2026 | 1:52 AM

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

19-04-2026 12:00 AM
  1. రేపు కాళేశ్వరానికి రైతులు, ప్రజలు తరలిరావాలి
  2. అక్కడే రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల
  3. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ని మెడిగడ్డలో ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలొచ్చి, విజయంతం చేయాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అక్కడే రైతు భరోసా రెండో విడత నిధులను వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు.

శని వారం మంథనిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్య కర్తల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు  నియోజకవర్గంలోని ప్రతి గ్రా మంలో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రైతులను పెద్ద ఎత్తున తరలించాలని, ఇందు కు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కృషి చేయాలని మంత్రి సూచించారు.

అలాగే రామగుండం పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాల నుంచి కూడా పెద్దఎత్తున రైతులు, ప్రజలు తరలివస్తారని, బహిరంగ సభలో ఎలాంటి అవంతరాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వేసవి దృష్ట్యా నీటి కొరత లే కుండా చూస్తున్నామని, ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ బహిరంగ సభ సోమవారం సాయం త్రం ఐదు గంటలకు మొదలవుతుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్‌చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముసుకుల సురేందర్‌రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు తొట్ల తిరుపతి యాదవ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్య క్షుడు సదానందం, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు, మం థని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, రోడ్డ బాబు, సయ్యద్ అన్వర్, మంథని, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్‌లు కుడుదల వెంకన్న, వైనాల రాజు, కమాన్‌పూర్, ముత్తారం, మంథని యూత్ అధ్యక్షులు రెబల్ రాజకుమార్, బక్కతట్ల వినీత్ యాదవ్, సాధుల శ్రీ కాంత్, సర్పంచులు ఉపసర్పంచ్‌లు, కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.