18 July, 2026 | 5:53 PM

Breaking News

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •   ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి

25-04-2026 12:00 AM

రెండవ దశ శిక్షణాలో కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) :  జిల్లాలో జనగణన-2027 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండవ దశ శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా అధికారులకు జనగణన కిట్లను కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ& జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ పనులను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈసారి జనగ ణనను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కోసం ‘సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ వంటి ఆధునిక యాప్లు, పోర్టల్స్ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందని, పొరపాట్లు నివారించవచ్చన్నారు. జనగణన నమోదు ప్రక్రియను రెండు విడతల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ముం దుగా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

అనం తరం మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారని చెప్పారు. జనగణన ద్వారా ప్రజల సంక్షేమం అనే నినాదంతో ప్రతి పౌరుడి వివరాలు నమో దు కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో సిబ్బంది పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రా జేశ్వర్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.