7 June, 2026 | 1:25 AM

గోదావరి ఇసుకపై సీబీఐ దర్యాప్తు జరపాలి

07-06-2026 12:00 AM
  1. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి 2 లక్షల కోట్లు విడుదల చేయాలి
  2. పీసా, 1/70 చట్టాల అమలులో వైఫల్యంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
  3. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్

పంజాగుట్ట, జూన్ 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గోదా వరి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వ కాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, అఖిల భా రత బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మా జీ ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్, అఖిల భారత ఆదివాసి సమన్వయ కమిటీ చైర్మన్ చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు.

శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో సిల్ట్ తొలగింపు పేరుతో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యని ఆరోపించారు. భద్రా చలం, దుమ్ము గూడెం, వాజేడు, వెంకటాపు రం ప్రాంతా ల్లో ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో ఇసు కను వెలికితీసి విక్రయిస్తున్న ప్పటికీ, స్థానిక ఆదివాసీ గ్రామాలకు తగిన ప్రయో జనాలు అందడం లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 74, ములుగు జిల్లాలో 40 కలిపి మొత్తం 114 ఆదివాసీ ఇసుక సొసై టీలు పనిచేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్య కలా పాల ద్వారా భారీ ఆదాయం సమ కూరు తున్నప్పటికీ, పీసా చట్టం స్ఫూర్తికి అనుగు ణంగా గ్రామసభల ఆధ్వర్యంలో ఆది వాసీ ప్రాంతాల అభివృద్ధికి నిధులు వినియోగిం చడం లేదని ఆరోపించారు. చందా లింగయ్య దొర వెల్లడించిన వివరాల ప్రకారం, రోజుకు సుమారు 5.7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వి, క్యూబిక్ మీటర్కు సగటున రూ.1,800 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కల ప్రకారం 2014 నుంచి 2026 వరకు గోదావరి ఇసుక తవ్వ కాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరి ఉండవచ్చని ఆయ న పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో బీసీ టైమ్స్ ఎడిటర్ సంగెం సూర్యారావు, ఆదివాసీ నాయకులు పాయం సత్యనారాయణ, జాతీ య ఆదివాసీ రాజ్యాంగ హక్కులుసంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి జాతీయ ప్రధాన కార్యద ర్శి రామనాల లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్లు,  పాయం సత్యనారాయణ, మడావి నరసిం హా రావు రాష్ట్ర కో-కన్వీనర్లు వజ్జా నర్సింహారావు, లోకిని రాజు, సంజీవ్ సడిమెక పాల్గొన్నారు.