13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

బస్‌స్టాండ్ అంతా గుంతలమయం

02-09-2025 12:00 AM
  1. బస్టాండ్‌లో ప్రతి ఏటా ఇదే పరిస్థితి 
  2. ఫ్లోరింగ్ ఏర్పాటు ఎప్పుడు..?

చర్ల, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి):  మండలం కేంద్రంలో గల బస్టాండ్ ప్రాంగణంలో వర్షం వచ్చిందంటే బురదమయం కనీసం నడవలేని పరిస్థితి కనిపిస్తోంది, నిత్యం బస్సుల రద్దీతో ఉండే బస్టాండ్ గుంతల మయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు,. అదేవిధంగా బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్ పట్టుమంటూ మూడు నెలలు కూడా ఉపయోగించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.

దాతల సహాయంతో ఆర్వో  ప్లాంట్ ఏర్పాటు చేశారు కానీ ప్రయాణికుల సౌకర్యం దాన్ని మరమ్మతులు చేయించి ఉపయోగం లోకి తెచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా గోదావరిని కల్పించే విధంగా వర్షపు నీరు గుంతలలో ఆగుతుంది అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంతంలో ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యార్థం డివిజన్ వ్యాప్తంగా ఉన్న భద్రాచలం బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ గా చర్ల బస్టాండ్ చెప్పవచ్చు దీన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులకు ఎంతైనా ఉంది, టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ సమస్యను పరిష్కరించాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.