2 July, 2026 | 12:06 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

అండ్రూను ఇంటి నుంచి గెంటేసిన బ్రిటన్ రాజు

01-11-2025 12:20 AM

సెక్స్ కుంభకోణంలో యువరాజు పేరు ఉండటంతో కీలక నిర్ణయం

అమెరికా, అక్టోబర్ 31: బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ౩ తన సోదరుడు, యువరాజు అండ్రూపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూను ఇంటి నుంచి వెళ్లగొట్లారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసులో ప్రముఖ రాజకీయ నేతలు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు అండ్రూ పేరు కూడా బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో బ్రిటన్ రాజు చార్లెస్ అండ్రూను ఇంటి నుంచి బలవంతంగా గెంటేసేడంతో పాటు ఆయనకున్న బిరుదలన్నింటినీ తొలగించినట్లు బకింగ్‌హోమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా సెక్స్ కుంభకోణంలో తన పేరు బయటకు రావడంతో ఆండ్రూ తనకున్న రాయల్ టైటిల్‌ను ఇటీవల వదులుకున్నారు. దివంగత రాణి ఎలిజబెత్ రెండో కుమారుడు, చార్లెస్ తమ్ముడు ఆండ్రూ జెఫ్రీ ఎప్‌స్టున్ సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఆండ్రూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.