21 April, 2026 | 3:03 AM

సమ సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యం

21-04-2026 01:33 AM
  1. బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగానే మహిళాబిల్లు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. ప్రంచానికే దార్శనికుడు బసవేశ్వరుడు: సీపీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): బసవేశ్వరుడు ఆశించిన కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బసవేశ్వరుని ఆలోచనా విధానం నుంచి గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందారని, అందుకే దేశంలో అధికారికంగా బసవ జయంతిని నిర్వహించడం తో పాటు, లండన్ నగరంలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించి, మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. 

బసవేశ్వర జయంతిని అధికారికంగా పార్లమెంటులో నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. నాడే  స్త్రీ సాధికారత కోసం కృషి చేసిన బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగానే, ప్రధాని మోదీ చారిత్రాత్మక ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ను తీసుకొచ్చారన్నారు. సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి రాంచందర్‌రావు నివాళులర్పిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వర మహారాజ్ నేడు కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాదని, ఆయన ఒక మహోన్నత సిద్ధాంతంగా, దైవం గా కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్నారని, ఆయన జీవిత చరిత్ర తరతరాలకు ప్రేర ణాదాయకమన్నారు. బసవేశ్వరుడు బోధించిన కాయకవే కైలాసం (శ్రమే దైవం)’ అనే సూత్రం నేటికీ మన సమాజాన్ని భక్తి, సేవ వైపు నడిపిస్తోందని, సంస్కృతిని కాపాడుకుం టూ సమాజ శ్రేయస్సు కోసం ఆ మహనీయుడు చూపిన బాటలో మనమంతా ముం దుకు సాగాలన్నారు.

బసవేశ్వర మహారాజ్ ఆలోచనా విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నగర పోలీసు కమిషనర్ వీసి సజ్జనార్ మాట్లాడుతూ బసవేశ్వరుడు ఓ ప్రాంతానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని సామాజిక విలువలలో ప్రపంచానికే దార్శనికుడు అన్నారు.

12వ శతాబ్దంలోనే సోషలిజం, కమ్యూనిజం ఆధునిక పార్లమెంటు వ్యవస్థను ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మాహిళా సాధికారత కోసం ఆనాడే పాటు పడ్డారని ఆయన సిద్ధాంతాలను ప్రపంచం పాటిస్తుందని అన్నారు. బసవేశ్వరుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలందరికీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.