17 June, 2026 | 2:52 PM

Breaking News

మృతి చెందిన జవార్ సింగ్ కుటుంబాని పరామర్శించిన ఎమ్మెల్యే.   •   చినలింగాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   ​మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'   •   న్యాయవాదుల హెల్త్ కార్డుల కోసం మహా ధర్నాకు పిలుపు   •   వానాకాలం సాగుకు ముందస్తు ఏర్పాట్లు చేయండి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి   •   పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం   •   ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం జిల్లా ఆగం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు   •   పూరీలు చేసి.. ఫుట్‌బాల్ ఆడి   •   యూరియా యాప్ రద్దు చేయాలంటూ.. భిక్కనూర్‌లో బీఆర్ఎస్ ధర్నా   •   అంధకారంలో ఆరోగ్య ఉపకేంద్రం   •  

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమం

16-06-2026 12:00 AM

బీసీఐ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు 

ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఇంటలెక్చువ ల్స్ ఫోరం (బీసీఐ) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. తెలంగా ణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా హిస్సా ఇజ్జత్ హుకూమత్ నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థి క, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు.

బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపా డుకోలేదని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్లకు ని యామక పత్రాలు అందజేశారు. ప్రొఫెసర్ బెనర్జీని రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ విజ య్ బాబును పొలిటికల్ అడ్వైజర్‌గా నియామక పత్రాలు అందజేశారు.