calender_icon.png 15 February, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైరమల్‌గూడ ఫ్లుఓవర్‌కు పూలే పేరు

15-02-2026 12:00:00 AM

టీఆర్పీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ

హైదరాబాద్(ఎల్‌బీ నగర్), ఫిబ్రవరి 14(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో శనివారం ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు లోని బైరమల్ గూడ ఫ్లైఓవర్‌కి మహాత్మా జ్యోతిరావు పూలే ఫ్లుఓవర్‌గాపేరు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్పీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్. రంగారెడ్డి జిల్లా టీఆర్పీ అధికార ప్రతినిధి   బొంగు వెంకటేష్ గౌడ్ అధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భావన వెంకటేష్, రాష్ట్ర యు వజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రం గారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ల వాసుదేవ్, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాకాల నర్సింహ్మ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సింగం అరుణ్, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, ఈ మహేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.