21 August, 2026 | 1:18 AM

బంగ్లా నూతనాధ్యక్షుడు మీర్జా ఫక్రూల్

21-08-2026 12:39 AM

255 మంది సభ్యుల మద్దతు

ఢాకా, ఆగస్టు 20 (విజయక్రాంతి): బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా అధికార నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యాడని ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గురువారం పార్లమెంటులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. మొత్తం 349 మంది సభ్యులుండగా మీర్జాకు 255 సభ్యుల మద్దతు లభించిందని ఈసీ వెల్లడించింది. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కర్నల్ ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయని తెలిపింది.

349 మంది రిజిస్టర్ చేసుకోగా 343 మంది ఓటింగ్ పాల్గొన్నారని పేర్కొంది. కాగా నేడే (శుక్రవారం) 24వ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రూల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా 35 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా బీఎన్‌పీ పార్టీలో సుధీర్ఘంగ కాలంగా ఉన్న ఈయనతో  భారతదేశ బంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు సన్నిహితుడిగా పేరున్న దేశాధ్యక్షుడు షాబుద్దీన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అధ్యక్ష ఎన్నిక జరిగింది.