2 July, 2026 | 2:36 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

19-12-2025 12:00 AM

రేగొండ, డిసెంబర్ 18 (విజయక్రాంతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డికి భూపాలపల్లి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది.మానసిక అనారోగ్యంతో 04-01-2024న తన తల్లి, పక్కింటి మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.

పోలీసులు పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. శ్రీనివాస్ వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.ఈ కేసు దర్యాప్తులో డీఎస్పీ ఎ. సంపత్ రావు, సీఐలు డి. వేణుచందర్, డి. మల్లేష్, సిహెచ్. కరుణాకర్ రావు, ఎస్‌ఐలు ఎన్. శ్రీకాంత్, కే. రాజేష్, సీడీఓ జ్యోతి, మహిళా పోలీసులు కీలకంగా పనిచేసినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వారిని అభినందించింది.ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.