23 June, 2026 | 11:36 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

టాక్సిక్ వచ్చేది అప్పుడే

23-06-2026 12:53 AM

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న తాజా సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ప్రఖ్యాత దర్శకురాలు గీతూ మోహన్ దాస్, రాకింగ్ స్టార్ యష్ కాంబోలో రానున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్  స్వీయ బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వా నీ, హ్యూమా ఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా తదితరులు అద్భుతమైన పాత్రల్ని పోషించారు.

కన్నడ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను దృష్టిలో ఉంచు కుని రూపొందించారు. అందుకే ఈ మూవీని కన్నడ, హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిని మా విడుద తేదీని తాజాగా ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ ఆగస్టు 26న సినిమాని రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. తాజా పోస్టర్ గమనిస్తే యష్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు.