23 June, 2026 | 11:36 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ది రెడ్ బ్యాగ్ ఇండియా అంతా సౌండ్ చేయాలి

23-06-2026 12:54 AM

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే ఏపీ మంత్రి టీజీ భరత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. మా రెడ్ బుక్ గురించి ఇండియా వ్యాప్తంగా తెలుసు.

అలా నే ఈ ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ కూడా ఇండియా అంతా సౌండ్ చేయాలి’ అని అన్నారు.  ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. ఈ చిత్రం హిట్ అయితే హరి మరిన్ని కొత్త సినిమాల్ని నిర్మిస్తారు. ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ.. త్వరలోనే ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ కాబో తోంది. అందరూ  సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. మా సినిమాకి కథే హీరో. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం చేసేలా మా ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా ఉంటుంది’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం శేఖర్ మోపురి, డీఓపీ ప్రియేష్ గురుస్వామి, ఎడిటింగ్ : శివ శర్వాణి