23 June, 2026 | 11:37 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

కొత్త వారిలో ఎంత టాలెంట్ ఉంది

23-06-2026 12:51 AM

‘టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాం బర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో జ్యూరీ ఛైర్ పర్సన్ ఇంద్రజ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 60కిపైగా ఎంట్రీలు వచ్చాయి. ఎంట్రీలు పరిశీలిస్తుంటే కొత్త వారిలో ఎంత టాలెంట్ ఉందో చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి మొదటి బహుమతి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. జ్యూరీ ఛైర్ పర్సన్ ఇం ద్రజ మాట్లాడుతూ.. సినిమా అనేది మీ కల, మీరు కోరుకునే భవిష్యత్తు. అందుకే జాగ్రత్తగా ప్రతి ఎంట్రీని పరిశీలించి అవార్డ్స్ కు ఎంపిక చేశాం.

మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుం టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అడ్వకేట్, నిర్మాత షరీఫ్, హైకోర్టు అడ్వకేట్ సుభాష్ రెడ్డి, టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, ఎస్‌బీఐ బ్యాంక్ బోర్డ్ మెంబర్ నరసిం హ, టీఎఫ్ సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్, హీరోయిన్ అక్సఖాన్, ఫైట్ మాస్టర్ రవి తదితరులు మాట్లాడారు. అనంతరం ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలింగా శీనుగాడి సైకిల్ స్టోరీ, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలింగా - సైబర్ స్లేవరీ, థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలింగా మాతృదేవోభవ ను ఎంపిక చేసి అవార్డ్స్ అందజేశారు.