ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ తీరే వేరు
- ఆ అటవిలో ఫారెస్ట్ చెట్లను కొట్టి విక్రయించిన వైనం
- గతంలో విజయక్రాంతి దినపత్రిక కథనంతో ఆధికారి సస్పెండ్
- ఫారెస్ట్ పరిధిలోనే ప్రైవేటు వ్యక్తుల పెత్తనం
- సమాచారం ఇస్తే.. ఇచ్చిన వారిపైనే దాడులకు పంపిస్తుండ్రు
- ప్రత్యేక సర్వే చేసి చర్యలు తీసుకుంటాం : ఎండి అబ్దుల్ హై, ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్, మహమ్మదాబాద్ మండలం
- రేంజ్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఇతరులను అడిగా : రాఘవేందర్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్
మహమ్మదాబాద్, ఏప్రిల్ 6 : జిల్లాలోని మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ తీరే వేరుగా ఉంది. ఆది నుంచి అక్కడ అందిన కాడికి లాగడమే లక్ష్యంగా కొందరి ఫారెస్ట్ అధికారుల తీరు దర్శనమిస్తుంది. గతంలోని ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జూలపల్లి ఫారెస్ట్ లోని చెట్లను కొట్టి లారీలలో ఎక్కించి దర్జాగా హైదరాబాద్ విక్రయించిన సంఘటన చోటు చేసుకున్న విషయం విధితమే.
తరుణంలో విజయక్రాంతి దినపత్రిక ఫారెస్ట్ అధికారులే అడవి భక్షకులా? అనే కథనాన్ని ప్రచురితం చేసింది. సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సంబంధిత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఫారెస్ట్ లో తీరు మాత్రం మారడం లేదని తెలుస్తుంది. ఫారెస్ట్ పరిధిలోనే ప్రైవేటు వ్యక్తులు వివిధ కళాపలకు పాల్పడుతున్న సంబంధిత అధికారి మాత్రం వారికి అండగా నిలవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ గ్రామస్తులు చెబుతున్న మాట.
ఫారెస్ట్ పరిధి నుంచి మూడు ఫీట్ల దూరం విడిచి ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరిధి నుంచి మూడు ఫీట్లు దూరంగా ఉండటం కాదు పరిధి దాటి అడవి ప్రాంతంలోకి వచ్చిన ఫారెస్ట్ అధికారి తెలిసి తెలియనట్లు వివరించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ అటవి ప్రాంతంలో మాత్రం ఫారెస్ట్ నిబంధనలు చెల్లనట్లు కనిపిస్తుంది. సంబంధిత అధికారి అండదండలు ఉంటే ఫారెస్ట్ అటవిలో ప్రవేట్ వ్యక్తుల అవసరాల నిమిత్తం ఏదైనా చేసుకునేందుకు అండగా నిలబడడం విశేషం.
ఫారెస్ట్ గురించి...ఫిర్యాదు చేస్తే అంతే
జూలపల్లి ఫారెస్ట్ గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. సమాచారం అడుగుదామని కార్యాలయానికి వెళ్లిన అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి చెపితే అక్కడివారికి ముందే సమాచారం ఇచ్చి మనకు తెలియకంటే ముందుగానే వారు కార్యాలయానికి వచ్చేస్తారు. తీరా మీకు ఎలా తెలిసింది అంటే వారు చెప్పారు మీరు చెప్పారు అంటు చెప్పడం విశేషం.
అసలుకు జూలపల్లి అటవీ ప్రాంత సంరక్షకుడిగా ఉన్న ఆ ఫారెస్ట్ అధికారి వారికి సమాచారం ఇస్తూ ఫారెస్ట్ ఏమైపోయినా పర్వాలేదు నేను మీకున్న అంటూ సాంకేతాన్ని పంపించడం వెనుక ఉన్న అంతరిమేమిటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయంపై ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ ను వివరణ కోరగా మీపై ఫిర్యాదు వచ్చిందని ఫోన్ చేసి చెప్పడం జరిగిందని పేర్కొనడం విశేషం. ఈ విషయం పై రేంజ్ ఆఫిసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు.
ఫారెస్ట్ ఎవరి చేతిలో ఉండాలి
ఫారెస్ట్ ను సంరక్షలకు సంబంధిత ఫారెస్ట్ అధికారులను నియమించి పర్యవేక్షణ నిరంతరం చేయాలని చెబుతున్నప్పటికీ కొందరి అధికారుల నిర్లక్ష్య కారణంగా అటవీ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం చేస్తున్న అస్సలు పట్టింపు లేకుండా పోతుంది. అధికారులు పూర్తిస్థాయిలో ఫారెస్ట్ ను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జూలపల్లి గ్రామస్తులు కోరుతుండ్రు.
దర్యాప్తు చేస్తాం..
పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. ఫారెస్ట్ హద్దు నుంచి మూడు ఫీట్ల దూరం విడిచి ప్రైవేటు వ్య క్తులు ఏదైనా చేసుకునే అవకాశం ఉంది. ఫారెస్ట్ లోనే ఏదైనా కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత ఫారెస్ట్ అధికారి సహకరించినట్లు తెలితే ఉన్నత అధికారులకు నివేది క అందిస్తాం.
ఎండి అబ్దుల్ హై, ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్, మహమ్మదాబాద్ మండలం




