15 April, 2026 | 3:57 AM

అందరికీ నచ్చే బ్యాడ్ బాయ్ కార్తీక్

15-04-2026 01:31 AM

నాగశౌర్య హీరోగా రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీవైష్ణవి ఫిలమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. “ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని నమ్ముతున్నా. ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి” అన్నారు. “ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. మా సినిమాను తప్పకుండా అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా” అని హీరోయిన్ విధి తెలిపారు.

నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ.. “ఎంతో కష్టపడి, ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఇందులో శౌర్యను ఒక డిఫరెంట్ స్టైల్‌లో చూస్తారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్రతి సినిమాలో చిన్నచిన్న కష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటేనే సక్సెస్ వస్తుంది.

ఇది మా ఫస్ట్ సినిమా. జూన్‌లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాం” అని చెప్పారు. ‘ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన మా పెద్దన్నయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాన’ని మరో నిర్మాత అశోక్ అన్నారు. నటీమణులు శ్రీదేవి విజయ్‌కుమార్, ప్రియ, డీఓపీ రసూల్, జీ స్టూడియోస్ గిరీశ్, మిగతా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.