డిప్యూటీ ఈవో పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్
మల్టీజోన్ 1,2ల పరిధిలో 24 ఖాళీల భర్తీ
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, గెజిటెడ్ హెడ్‌మాస్టర్, గ్రేడ్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలను మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో ఈ నెల 12 నుంచి 19 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
పరీక్షను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మల్టీజోన్ 1లో 10 పోస్టులు, మల్టీజోన్ 2లో 14 పోస్టులు ఉన్నాయని తెలిపారు. వయోపరిమితి జూలై 1 నాటికి కనీస వయసు 18 నుంచి 44 సంవత్సరాలు, విద్యార్హత యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.






