25 July, 2026 | 5:04 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో 29వ రోజు నిరసన

25-07-2026 04:13 PM

గణపురం,జులై 25 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఏహెచ్‌పీ, సీఎహెచ్‌పీ విభాగాల ప్రైవేటీకరణ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపిలో కార్యక్రమం టీజీపీఈజేఏసీ  ఆధ్వర్యంలో 29వ రోజు శనివారం నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ చర్యలు ఉద్యోగుల భవిష్యత్తును, సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.వై టి పి ఎస్ ఏహెచ్‌పీ, సీఎహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగుల ఆందోళనలను గౌరవించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టెండర్ రద్దు అయ్యే వరకు టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నిరసనలో టీజీపీఏ, టీఎస్‌ఈఏఈఏ, 1104, 327, 1535, కెమిస్ట్ అసోసియేషన్, డిప్లొమా అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.