25 July, 2026 | 5:23 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

పనులను త్వరగా పూర్తి చేయండి

25-07-2026 04:15 PM

అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నగర మేయర్ 

ముకరంపుర, జూలై 25(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ మార్కెట్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,డిప్యూటీ మేయర్,  యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.నూతనంగా నిర్మిస్తున్న కాశ్మీర్ గడ్డలోని రైతు మార్కెట్‌ లో మిగిలిపోయిన పనులను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే ఆగస్టు నెలలో ఈ మార్కెట్‌ను ప్రారంభించేలా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని వారు స్పష్టం చేశారు.అనంతరం గతంలో పద్మనగర్‌లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి గల అవకాశాలను పరిశీలించారు.ఈ మార్కెట్‌ ను వినియోగంలోకి తేవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో విజిట్ చేసి సమీక్షించారు.ఈ కార్యక్రమంలో 61వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అథీఫ్, పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు