మానవత్వం చాటుకున్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
27-04-2026 12:51 AM
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు
సంగారెడ్డి, ఏప్రిల్ 26 : టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్షతగాత్రున్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పరిషత్ ఎదురుగా రోడ్డులో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదేదారిలో వెళ్తున్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గమనించి 108 అంబులెన్స్కు ఫోన్ చేసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రున్ని తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.






