ముగిసిన టీజీఐసీసీ స్పోర్ట్స్ మీట్
13-06-2026 12:22 AM
విజేతలకు చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి బహుమతుల ప్రదానం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ మూడో రోజైన శుక్రవారం ఉద్యోగుల సాంస్కృతిక వేడుకలతో ముగిసింది. శుక్రవారం గచ్చిబౌలి ఐఎస్‌బిలోని ఖేంకా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. క్రీడా పోటీల్లో విజేతలకు టీజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఈడీలు పవన్, వీరారెడ్డి, సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






