13 June, 2026 | 4:12 AM

చెంచు గిరిజనుల అభివృద్ధికి శాఖల సమన్వయం అవసరం

13-06-2026 12:22 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట, జూన్ 12 (విజయక్రాంతి): చెంచు గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మన్ననూ రు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెంచు కుటుంబాలకు విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, పోషకాహారం, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

చెంచు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరయ్యేలా చూడడంతో పాటు డ్రాప్ అవుట్ ల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు, టీకాలు, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చోట్ల సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెంచు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.