భిక్కనూర్ పీహెచ్‌సీని సందర్శించిన టీజీఎస్‌ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్
21-05-2026 12:40 AM
భిక్కనూర్, మే20(విజయ క్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని టీజీఎస్‌ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి మేడమ్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులందరికీ, అధిక ప్రమాదం ఉన్న రోగులకు హెఐవీ మరియు వీడీఆర్‌ఎల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
అలాగే హెఎంఐఎస్ నమోదులను సక్రమంగా నిర్వహించాలంటూ అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఓపీ రిజిస్టర్, ల్యాబ్ రిజిస్టర్లను తనిఖీ చేసి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ యేమిమ, హె ఈ ఓ వెంకటరమణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






