కొనసాగుతున్న జనగణన
21-05-2026 12:38 AM
తాడ్వాయి, మే, 20 (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో జనగణన కొనసాగుతుంది. మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్యుమరేటర్లు జనాభా వివరాలు సేకరిస్తున్నారు. జనగణనకు ప్రతి ఒక్కరు సహకరించాలని, జన గణన పూర్తి అవుతే జనాభా వివరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న జనగణలో ఎన్యూమరేటర్లు ఎండను సైతం లెక్కచేయకుండా జనాభా వివరాలు సేకరిస్తున్నారు. నందివాడలో ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు సత్యం, సంతోష్ జనగణలో పాల్గొని వివరాలు పొందుపరుస్తున్నారు.






