1 August, 2026 | 9:48 PM

విశ్వేశ్వర ఇంజనీర్స్ కాలనీలో వన మహోత్సవం

01-08-2026 08:47 PM

హస్తినాపురం: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ బయోడైవర్సిటీ, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హస్తినాపురంలోని విశ్వేశ్వర ఇంజనీర్స్ కాలనీలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ సుధారాణి, సర్కిల్ మేనేజర్ శ్రీనివాస చారి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పర్యావరణ మిత్ర అవార్డ్ గ్రహీత డాక్టర్ టి.సురేందర్, హార్టికల్చర్ సూపర్ వైజర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంకాల శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అమర్నాథ్ యాదయ్, అయిలేష్, ఎం.ఎం.సి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

కాలనీ వాసులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంకాల శేఖర్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి గోల్సాం అమరనాథ్  యాదవ్, కోశాధికారి ధర్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎం ప్రవీణ్ రెడ్డి, ఐలేష్ గౌడ్, అల్వాల్ గౌడ్, శివ శంకర్ రెడ్డి,  వీరేందర్ రెడ్డి,  రాజశేఖర్ రెడ్డి, లట్టుపల్లి రాజశేఖర్ రెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గుప్తా, శేఖర్ గౌడ్, సతీష్  తదితరులు పాల్గొన్నారు.